కమ్యూనిస్టులకు అధ్యయనం ఆచరణ తప్పనిసరి….. వి. మనోహర్ రాజు మాజీ TPTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ స్టడీ సర్కిల్ ప్రారంభం.
కమ్యూనిస్టులు తమ జీవిత కాలాల్లో నిరంతరం అధ్యయనం చేస్తూనే ఆచరణ జోడించడం వల్ల ఫలితాలు సాధించడం కోసం కృషి చేయాలని మాజీ టి పి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. మనోహర్ రాజు పిలుపునిచ్చారు.
స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ కన్వీనర్ రాయల రవికుమార్ అధ్యక్షతన జరిగిన స్టడీ సర్కిల్ లో వారు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యయనం లేని ఆచరణ, ఆచరణ లేని అధ్యయనం లక్ష్యం లేనిదని సమస్యలు పరిష్కరించుకునే దృష్టితో శాస్త్రీయ అవగాహన పెంచుకోవడం కోసం గ్రంథాలను అధ్యయనం చేయడం మాక్సిస్టు దృక్పధమన్నారు. విప్లవకారులకు గమ్యం పట్ల ఉండవలసిన పట్టుదల ఆ పట్టుదలకు పునాదిగా ఉండే రాజకీయ సైదాంతిక అవగాహన పెంపొందించుకోవడం అవసరమన్నారు. సమాజ మార్పు కోరుకునే కమ్యూనిస్టులు బాధ్యతాయుతమైనటువంటి అధ్యయనం పట్ల దృష్టి సారించాలన్నారు. సమాజంలో జాతీయంగా, అంతర్జాతీయంగా రోజురోజుకు జరుగుతున్న పరిస్థితుల్ని చైతన్యవంతంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ భౌతిక వాస్తవాలతో ముందుకెళ్లాల్సిన అవసరాన్ని మార్క్సిస్టు మహోపాధ్యాయులు బోధించిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. కార్యకర్తలు, నాయకులు అధ్యయనం పట్ల వహిస్తున్న అశ్రద్ధలు తప్పుడు పద్ధతులను తెలుసుకొని క్రమ పద్ధతిలో చదవడం, అర్థం చేసుకోవడం మాక్సిజం మౌలిక అంశాలతో, అవగాహనతో ముందుకెళ్లడం అలవర్చుకోవాలన్నారు.
ఈ స్టడీ సర్కిల్ లో స్టడీ సర్కిల్ నిర్వహణ కమిటీ సభ్యులు టి .ఝాన్సీ,కొల్లేటి నాగేశ్వరరావు, ఏ రామారావు పుసులూరి నాగేశ్వరరావు, మాస్ లైన్ డివిజన్ నాయకులు శోభ, ఆవుల మంగతాయి, కే శ్రీనివాస్, లక్ష్మణ్, పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల.అజాద్ , పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి , పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రాకేష్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు యోగానందం, తదితరులు పాల్గొన్నారు.