వందనం గ్రామంలో లో బిజెపి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు తనయుడు వినూత్రావ్ ఆధ్వర్యంలో రంజాన్ కానుకల పంపిణీ..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు
_ బిజెపి మైనార్టీ మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సిద్ధిమియా
_ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మద్దినేని వెంకటేశ్వర్లు
చింతకాని / ఏప్రిల్ 10 (జై తెలంగాణ న్యూస్ )
చింతకాని మండలం వందనం గ్రామంలో బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి వినోద్ రావు తనయుడి తనయుడి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుకలను అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా వినోద్ రావు తనయుడు మాట్లాడుతూ
పవిత్ర రంజాన్ పర్వదినం భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ తనయుడు.. ముస్లిం సోదరులకు సూచించారు.బుధవారం సాయంత్రం బిజెపి మైనార్టీ మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ సిద్ధిమియా ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ రావు తనయుడు బిజెపి నాయకులతో కలిసి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ వందనం గ్రామ శాఖ అధ్యక్షులు శనగారపు రామకోటయ్య , భీమిరెడ్డి ఆదినారాయణ, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కొండా వెంకన్న , బిజెపి సీనియర్ నాయకులు ముకుందరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.