మాజీ ఎంపీపీ నారపోగు వెంకటేశ్వర్లు, భౌతిక దేహానికి ఘనంగా నివాళులు అర్పించిన రాయల నాగేశ్వరరావు
చింతకాని ఏప్రిల్ 14 జై తెలంగాణ న్యూస్
చింతకాని మండలం వందనం గ్రామంలో క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందిన చింతకాని మాజీ ఎంపీపీ నారపోగు వెంకటేశ్వర్లు, భౌతిక దేహానికి డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పూల మాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.