ప్రతినెల ఆటో డ్రైవర్ లకు జీవన భృతి 12 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి

ప్రతినెల ఆటో డ్రైవర్ లకు జీవన భృతి 12 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి

జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో ఏప్రిల్ 26:-

ఆటో డ్రైవర్ లకు ప్రతి నెల జీవన భృతి 12 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని ఆటో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. శుక్రవారం రాష్ట్ర ఆటో జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్ రావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లకు మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన తీవ్రంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని, వారి కుటుంబ పోషనే భారంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య కు పాల్పడ్డారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ప్రతినెల జీవనభృతి కింద 12 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, ఆ పథకంలో లోపాలు ఉన్నాయని, మహాలక్ష్మి పథకాన్ని కొంత మార్పులు, చేర్పులు చేసి ఆటో కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటరీ ఇంచార్జ్ చల్ల విక్రం, మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ పొట్ట మధుకర్, ఎండి షఫీ, సుద్దాల రాజు మొయ్య రాంబాబు, ఎండి హబీబ్, బుర్ర వెంకటేష్, కల్వల అంజయ్య, ఖలీమ్, మహేష్, శోభన్, సత్యం, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :