ఖమ్మంలో మరోసారి గెలుపు నామాదే
- -ప్రత్యర్ది ప్రక్క జిల్లా కావటం కలిసోచ్చే అంశం
- -పార్లమెంట్ లో అత్యధిక హాజరున్న నామా
- -తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్ లో ఓటు వేసిన నామా
- -ఖమ్మం జిల్లాలో హైవే రోడ్లు తెచ్చిన ఘనత నామా దే
జై తెలంగాణ న్యూస్ ( ప్రత్యేక ప్రతినిధి – పాషా )
ఖమ్మం ఎంపి బరిలో నామా మూడో సారి విజయం సాదిస్తాడు.ప్రత్యర్ది కాంగ్రెస్ పార్టీ స్థానికుడైతె నామాకు కష్టంగా మారేది.కాని రాజకీయాలతో సంభందం లేని ప్రక్క జిల్లాకు చెందిన నేతను బరిలో దించటం నామా నాగేశ్వరరావు వు వరంగా మారింది.నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ వ్యాపారాలతో పాటు పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో మధుకాన్ షుగర్ ప్యాక్టరీ తో ఏంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా పేద విధ్యార్దులకు నగధు పంపిణీ చేసి వారి ఉన్నత విధ్యకు సహకరిస్తున్నారు.అంతే కాదు తన తల్లిదండ్రుల పేరుతో ఖమ్మం జిల్లాలో వేల మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చోక్కాలు పంపిణీ చేస్తున్నారు.ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో బందువులు మిత్రులు కలిగి ఉండటం ఆయన అభిమానులను పేర్లు పెట్టి పిలువగల గుర్తింపు కార్యకర్తలకు ఉంది.పార్లమెంట్ లో తెలంగాణ బిల్లులో ఓటు వేయటం మాత్రమో కాదు తెలంగాణ కు రావాల్సిన నిధులు రోడ్లు విషయం లో పార్లమెంట్ సాక్షీగా ఏన్నో పోరాటాలు చేసి బిజేపి ప్రభుత్వం పై ఘాటుగా స్పందించి ఏన్నో నిధులు తెచ్చిన ఘనత కేవలం ఖమ్మం జిల్లాలో ఎంపిలలో నామా కే దక్కింది.పార్టీలకు అతీతంగా నామా నాగేశ్వరరావు కు ఓట్లు వేసే అవకాశం ఉందని ప్రత్యర్దులు ఎన్ని కోట్లు కుమ్మరించినా ఈ సారి ఖమ్మంలో నామా గెలుపు ను ఆపలేరన్నది సత్యం.