రాహుల్ గాంధీ వినూత్న నిరససన
దిల్లీ, (ADITYA9NEWS): మోడీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేఖిస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్నఆందోళనలకు మద్ధతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు వచ్చారు. రైతు గొంతును ప్రభుత్వం నొక్కిపెడుతుందన్న ఆయన, సాగు చట్టాలను రద్ధు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు వ్యాపారస్తులకు లాభం చేకూర్చేలా ఉన్న వ్యవసాయ చట్టాలను మోడీ సర్కార్ ప్రోత్సహించడం సరికాదన్నారు. చట్టాలు రద్దు చేసే వరకూ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఈసందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు.