తూ.గో.జిల్లాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేగవంతం
కాకినాడ,(ADITYA9NEWS): తూర్పుగోదావరి జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మెగా వ్యాక్సిన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లాలో దాదాపుగా అన్ని మున్సిపాల్టీలతోపాటు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లలో అన్ని డివిజన్లలలో వ్యాక్సినేషన్ విజయవంతం చేశారు. గ్రామ/ వార్డు సచివాలయాలలో నేరుగా ప్రజల వద్దకు అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. దాదాపుగా సచివాలయాలకు ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేశారు. అయితే ఎక్కువగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంచారు.