జిల్లా మొత్తం మీద 3 కరోనా కేసులే నమోదు
కాకినాడ,(ADITYA9NEWS) : రాష్ట్రంలో ఎక్కువ కరోనా కేసులు ఎక్కడ నమోదవుతున్నాయంటే టక్కున చెప్పేది తూర్పుగోదావరి. అలాంటిది ఆ జిల్లాలో మంగళవారం వచ్చిన కోవిడ్ కేసుల సంఖ్య సంఖ్య చూసి అంతా ఆశ్చర్యపోయారు. కేవలం 3 కేసులు మాత్రమే నమోదు కావడం నిజంగా జిల్లా వాసులకు ఆనందకర వార్తే . అయితే అంత తక్కువ నమోదయ్యాయంటే కరోనా పరీక్షలు జరగక నివేదిక ఇలా వచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వాస్తవానికి చూస్తే కేసులు సంఖ్య అనుకున్నంతగా తగ్గడం లేదు. కాని మంగళవారం విడుదల చేసిన నివేదికలో మూడు కరోనా కేసులే రావడం వెనుక వివరాలు ఆరా తీస్తే, సోమవారం మెగా వ్యాక్సినేషన్ ఉండటంతో జిల్లాలో ఎక్కడా కరోనా పరీక్షలు నిర్వహించలేదు. అంతకముందు రోజు ఆదివారం కూడా కరోనా టెస్ట్‌లు జరగకపోవడంతో రెండు రోజులు కరోనా పరీక్షలు జిల్లాలో లేవనే చెప్పాలి. ఈప్రభావంతో తూర్పుగోదావరిలో కేవలం 3 కేసులే నమోదైనట్టు మంగళవారం విడుదల చేసిన నివేదికలో చూపించారు అధికారులు. కరోనా పరీక్షలు జరిగినా కేసులు ఇలా మూడో, నాలుగో ఉండాలనే కోరుకుందాం.