చైనాను ఓడించిన తెలుగుతేజం
టోక్యో,(ADITYA9NEWS): స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్కోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాన్ని ఎగరేసుకుపోయింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ చైనా కు చెందిన బింగ్‌జియావోతో తలపడి కాంస్య పతకం గెలుచుకుంది. వరుస సెట్లలో 21-13, 21-15 తేడాతో విజయ ఢంకా మోగించింది.
రెజ్లర్ సుశీల్ కుమార్ తరువాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ అందుకున్న అథ్లెట్ గా సింధు రికార్డు సాధించింది. అంతకముందు సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు పొరపాట్లను సర్ధుబాటు చేసుకుని జాగ్రత్త పడింది. కొత్త ఎనర్జీతో , ఫుట్‌వర్క్‌తో ముందుకు దూసుకెళ్లింది. భారతీయుల ఆశీస్సులతో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది.