రికార్డు స్థాయిలో డెల్టా వేరియంట్..కరోనా కట్టడికి అష్టకష్టాలు
బీజింగ్,(ADITYA9NEWS): డెల్టా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో 18 ప్రావిన్సుల పరిధిలో 27 నగరాలకు వ్యాపించిన ఈ మహమ్మారి దెబ్బకు డ్రాగన్ దేశం విలవిలాడుతోంది. ఇప్పటికే చైనాలో డెల్టా వేరియంట్ వల్ల అతి ప్రమాదకర ప్రాంతాల సంఖ్య 95కి చేరింది. డెహూంగ్, నన్ జింగ్, ఝెంగ్‌జౌ ప్రాంతాలు అతి తీవ్ర ముప్పున్న ప్రాంతాల జాబితాలోకి చేరాయి. ఈప్రభావంతో చైనాలో ప్రావిన్సుల నుండి బీజింగ్‌కు రాకపోకలను నిలిపివేశారు. నన్ జింగ్ విమానాశ్రయం నుంచి కొత్త వేరియంట్ కేసులు బయటపడి, ఇతర ప్రాంతాలకు పాకినట్టు శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఝాంగ్‌జియాజీలోని ఓ థియేటర్‌లో
నిర్వహించిన ఓ *షో * కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.
ఆర్లాండో, (ADITYA9NEWS): అమెరికాలోని ఫ్లొరిడా రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఎన్నడూ లేని విధంగా తీవ్రరూపం దాల్చింది. 24 గంటల వ్యవధిలో 21,683 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ కేసుల్లో ఎక్కువ డెల్టా వేరియంట్ కావడంతో జనం హడలిపోతున్నారు. ఈవారంలోనే కోవిడ్ ప్రభావంతో అక్కడ 409 మంది మృతి చెందారు. ఇక్కడ వాతావారణం వేడిగా ఉండటంతో ఏసీలు ఉపయోగం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతోనే వైరస్ వ్యాప్తి పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇక్కడ 50 శాతం కేసులు పెరిగినట్టు చెబుతున్నారు. ఇక్కడ వ్యాక్సినేషన్ 60 శాతం వరకూ మాత్రమే జరిగింది.