* ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.
* కుమార్తె, తండ్రి మృతదేహాలు లభ్యం
మామిడికుదురు, (ADITYA9NEWS) : ఆనందంగా ఉండే ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తెలిసి చేసిన తప్పో, తెలియక మోసపోయినతనమో మొత్తానికి అప్యాయకుటుంబంలో అల్లర్లు రేగాయి. భర్త వేదనను చూసి భర్య తట్టుకోలేకపోయింది. కలిపి నిర్ణయించుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లలతో సహా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురిలో తండ్రి, కుమార్తె మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురునకు చెందిన కంచి సతీష్(32), భార్య సంధ్య(28) దంపతులకు కుమారుడ జస్విన్(4), కుమార్తె శ్రీ దుర్గ(2)లు చించినాడ వంతెన వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సతీష్ ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లి జూలై 20న తిరిగి వచ్చాడు. అతడు వచ్చే సమయానికి పిల్లలు అతడి సోదరి వద్ద సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఉన్నారు. భార్య సంధ్య మాత్రం ఆమె పుట్టిల్లు పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఉంది. సోదరి వద్దకు వెళ్లిన సతీష్ పిల్లలను వెంట పెట్టుకుని ఆచంటలో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. తాను సౌదీలో సంపాదించి భార్యకు పంపించిన నగదు, బంగారం కొందరు కాజేసి, తన భార్య ను మోసం చేశారని తెలుసుకున్న సతీ|ష్ తీవ్ర ఆవేదన చెందాడు. కుటుంబం కోసం చెడుగా మాట్లాడుకోవడం విన్న అతడు కుమిలిపోయాడు. ఈవిషయాలపై భార్యతో చర్చించిన అనంతరం కుటుంబంతో సహా చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు సతీష్. భార్యను తీసుకుని చించినాడ వంతెన నుండి వశిష్ట గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సతీష్, అతడి కొడుకు జస్విన్ మృతదేహాలు లభ్యం కాగా, భార్య సంధ్య, కుమార్తె శ్రీదుర్గల కోసం గాలింపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు ముందు సంధ్య తనను ఫణింద్ర అనే వ్యక్తి మోసం చేశాడని, నిద్ర మాత్రలు ఇచ్చి నగదు కాజేసాడని వాయిస్ రికార్డుతోపాటు, కాగితంపై ఆత్మహత్యకు కారణాలు రాసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.