24 గంట‌లు.. రాష్ట్రంలో అనూహ్య మ‌లుపులు

..

రాష్ట్రంలో క‌రోనా వేడి అటుంంచితే..తాజాగా రాజ‌కీయ వేడి పుట్టింది.
ఉహించ‌ని విధంగా వైసీపీ దూసుకుపోతుంది. వైసీపీ పాల‌న‌ను ఎండ‌గ‌డ‌తామ‌న్న
టీడీపీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి
సైతం దారి లేని ప‌రిస్థితి దాపురించింది. ఇక మాజీలైతే
మూల‌కుపోవాల్సిందేన‌న్న‌ట్టుగా ప్ర‌స్తుతం రాజ‌కీయం జ‌రుగుతోంది. ఈఎస్ ఐ
స్కామ్‌లో అచ్చ‌న్నాయుడిని అరెస్టు చేసిన ఏసీబీ విజ‌య‌వాడ‌లో ఏసీబీ
కోర్టు న్యాయ‌మూర్తి ముందు హాజ‌రుప‌రిచారు. అయితే ఆయ‌న‌కు ఇటీవ‌ల
చిన్న‌పాటి శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని అనారోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా
గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. అచ్చ‌న్నాయుడిని
ప‌రామ‌ర్శించేందుకు గుంటూరు వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబుకు
అనుమ‌తి నిరాక‌రించారు.దీంతో ఆయ‌న జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేసి
వెనుతిర‌గాల్సి వ‌చ్చింది. ఇంకొప‌క్క అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్
రెడ్డి సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అత‌ని కుమారుడు అస్మిత్
రెడ్డిల‌ను హైద‌ర‌బాద్‌లో ఆంద్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
ర‌వాణాశాఖ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేఖంగా లారీల చాసీస్‌లను తీసుకొచ్చి న‌కిలీ
రిజిస్ట్రేష‌న్‌లు చేశార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. ఇదిలా ఉంటే ప‌శ్చిమ
గోదావ‌రి జిల్లా నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అనుమ‌తిలేని నిర‌స‌న‌లు
చేస్తున్నార‌ని, పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగిస్తున్నార‌ని ప‌లు
సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. తూర్పుగోదావ‌రి
జిల్లాలో కాకినాడ రూర‌ల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మీ తృతీయ
కుమారుడు రాధాకృష్ణ‌ తన భర్త అని, అతడికి రెండ‌వ వివాహం
జ‌రిపించార‌ని, ఇందుకు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులైన మాజీ మంత్రులు య‌న‌మ‌ల
రామ‌కృష్ణుడు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ల‌తోపాటు పిల్లి అనంత‌ల‌క్ష్మీ,
పిల్లి స‌త్తిబాబుల‌పై మంజు ప్రియ అనే ద‌ళిత యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు
చేసింది. దీంతో మాజీ మంత్ర‌లిద్ద‌రిపైనా  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును
న‌మోదు చేశారు. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న
తొండంగి పోలీస్‌స్టేష‌న్‌లో వీరిపై కేసులు న‌మోదు కావ‌డం కూడా అనూహ్య‌మే.
అయితే ఈ సంఘ‌ట‌న‌ల్ని కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కు
దారితీసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :