అమరావతి,(ADITYA9NEWS): పులి చింతల పాపం వైఎస్ వైసీపీదేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు లోకేష్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
“లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఆయన కుమారుడు జగన్ హయాంలో బయటపడుతోంది. అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన జలయజ్ఞం పేరుతో భారీ అవినీతి జరిగిందని లోకేష్ ఆరోపించారు.పని చేయని విషయాల గురించి ముఖ్యమంత్రి భ్రమలు సృష్టిస్తున్నారని, అందులో జాబ్ క్యాలెండర్ ఒకటి అని డిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.
సిఎం ఇటీవల జారీ చేసిన జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేయాలని , 2.3 లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న యువతకు నిరుద్యోగులంతా ఏకమై మద్ధతివ్వాలన్నారు. తాము రూపొందించిన నూతన వెబ్‌సైట్‌లో ఉద్యోగం లేని యువకులందరూ నమోదు చేసుకోవాలని, ముఖ్యమంత్రి వద్దకు ఈ సమస్యలన్ని తీసుకెళ్లి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాడాలని లోకేష్ పిలుపునిచ్చారు.