మాజీ మంత్రికి వరుస పరాభవాలే..పార్టీ పట్టించుకున్నదెక్కడ.!
ఖమ్మం,: రాజకీయాల్లో ఉద్దండు, అతనొకప్పుడు చక్రవర్తి .తెలంగాణాలోని ఖమ్మం రాజకీయాలలో ప్రశ్నించబడని రాజు ఉన్నాడంటే అది తుమ్మల అనే చెప్పాలి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రోజు రోజుకు చులకనవుతుననారు. సోషల్ మీడియా వేదికగా తుమ్మలను ఆడుకుంటున్నారు అక్కడి వారు.
పూర్తి వివరాల్లోకి వెళదాం..
తుమ్మల నాగేశ్వరరావు 1980 ల నుండి ఖమ్మం జిల్లాలో ఒక మహాకూటమి లాగా ప్రయాణించారు. అతను టిడిపిలో మంత్రి అయ్యారు.మరియు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మహానాయకుడిగా పేరుగాంచారు . ఉన్నది ఉన్నట్టు మోహం మీదే కడిగి పారేసి తత్వం ఆయనది. తన కఠినమైన శైలి మరియు నిస్సందేహమైన వైఖరికి పెట్టింది పేరు తమ్మల నాగేశ్వరరావు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ తర్వాత టీడీపీని వీడి గులాబి గూటికి చేరారు. కేసీఆర్ ప్రోత్సాహంతో మంత్రి కూడా అయ్యారు, కానీ కేసీఆర్ రాజకీయ చతురతను తట్టుకోలేకపోయారు తుమ్మల. కేసీఆర్ ప్రొద్భలంతో ఖమ్మం జిల్లాలో ఒక చిన్న నాయకుడు తుమ్మలను వేగంగా దాటుకుపోయాడు. ఈ దెబ్బకు 2018లో తుమ్మలకు ఓటమి తప్పలేదు. అక్కడి నుండి వరుసగా అన్ని పతనాలే. తుమ్మలను పట్టించుకున్నవారే పార్టీలో లేరు.
ఒకరకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుమ్మలకు చెక్ పెట్టిందనే చెప్పాలి. దీంతో ఆ యువ నాయకుడికి అడ్డులేకుండా పోయింది. ఇంకేముంది తుమ్మలను సోషల్ మీడియా వేదికగా ఆడుకోవడం మొదలైంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. పైగా మాజీ మంత్రిపై పోస్టులు పెట్టే వారంతా ఆ పార్టీ యువకులే కావడంతో పోలీసులు వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో తుమ్మల కష్టాలు చెప్పలేనట్టుగా పేరుకుపోతున్నాయి.