కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ
కాకినాడ,() : దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ దివాళాకోరు విధానాలకు వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా స్పూర్తితో సేవ్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం కార్మిక సంఘాలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ , 3 వ్యవసాయ నల్ల చట్టాలను,44 కార్మిక చట్టాలను రద్దు చేయడంతోపాటు, 4 లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ పరిధిలో లేని ప్రతీ కార్మికుడికి నెలకు రూ.7500 చొప్పన 6 నెలలు చెల్లించాలన్నారు.
పెట్రోల్, గ్యాస్, డీజీల్ ధరలు నియంత్రించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని కోరారు. వీటితోపాటు కార్మికులకు పూర్తి రక్షణ ఇచ్చే చట్టాలను తీసుకురావాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై ఆగష్టు 9న చేపట్టే సేవ్ ఇండియా ఉద్యమానికి కార్మికులంతా మద్ధతివ్వాలన్నారు. కాకినాడలో శనివారం నిర్వహించిన బైక ర్యాలీ భానుగుడి వద్ద ప్రారంభమై, జగన్నాథపురం వంతెన మీదుగా దేవాలయం వీధి నుండి కలెక్టరేట్‌కు చేరుకుంది.
CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, AITUC జిల్లా సీనియర్ నాయకులు P.S నారాయణ, IFTU రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, INTUC ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు, AICCTU జిల్లా కార్యదర్శి గొడుగు సత్యన్నారాయణ, IFTU జిల్లా సహాయ కార్యదర్శి, గుబ్బల ఆదినారాయణ తదితరులు నిరసన కార్యక్రమాలనుద్దేశించి మాట్లాడారు.