శభాష్ సైరా జువెంటాస్
హైదరాబాద్, (ADITYA9NEWS)
ఆమె పేరు సైరా జువెంటాస్, ఇంకా 16 నెలలు కూడా నిండలేదు. కానీ ఆమె ఒత్తైన జుట్టును, మంచి ఆకృతి కలిగిన జుట్టును దానం చేసింది. అదేంటి జుట్టు దానం చేయడం అనుకుంటున్నారా, అది కూడా ఇక్కడ స్పెషలే. సాధారణంగా పిల్లల జుట్టును దేవుళ్లకి మొక్కుగా ఇస్తుంటారు. కానీ సైరా జువెంటాస్ జుట్టును మాత్రం ఆమె తల్లి క్యాన్సర్ బాధితుల కోసం ఇచ్చింది…పూర్తి వివరాల్లోకి వెళదాం.
హైదరాబాద్‌లో ఉంటున్న జెరూషా డోర్కాస్ తన కుమార్తె ఒదుగైన జుట్టును, క్యాన్సర్ బాధితుల కోసం దానం చేసింది. అతి పిన్న వయస్సు ఉన్న జువెంటాస్ జుట్టును హైదరాబాద్‌లోని హెయిర్ డోనేషన్ ఫౌండేషన్‌కు అందించారు. క్యాన్సర్‌తో బతికున్న వారికి ఈ జుట్టు ఎంతో అవసరం. ఇలా జుట్టు దానం చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని తల్లి డోర్కాస్ తెలిపింది..ఇంకా ఆమె ఏమన్నారంటే..
“కీమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా క్యాన్సర్ చికిత్సకు ప్రతిస్పందించే సమయంలో పిల్లలతో సహా చాలా మంది క్యాన్సర్ రోగులు తమ జుట్టును కోల్పోతారనే విషయం తెలిసిందే. నేను వారి కోసం నా కుమార్తె జుట్టును దానం చేయాలనుకున్నాను. సైరా యొక్క జుట్టు ఖచ్చితంగా తక్కువ వ్యవధిలో తిరిగి పెరుగుతుంది.
కానీ ఆమె దానం చేసిన వెంట్రుకలు క్యాన్సర్ రోగికి జుట్టు రాలడం అనే బాధను అధిగమించడానికి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని జెరూషా డోర్కాస్ చెప్పింది. ఇప్పటి వరకూ తన జుట్టును కూడా తల్లి మూడుసార్లు దానం చేసినట్టు వెల్లడించింది.
క్యాన్సర్ బాధితుల కోసం చిన్న పిల్ల జుట్టు ఇవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగా ఇది ఒక సహాయంలాంటిది. క్యాన్సర్ బాధితులు చికిత్స తర్వాత జుట్టు కోల్పోవడంతో వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కానీ విగ్గుల ద్వారా వారికి కొత్త జుట్టుకు అవకాశం కల్పించవచ్చు. క్యాన్సర్ చిన్నారులకు సైరా జువెంటాస్ లాంటి పిల్లల జుట్టు ఎంతో అవసరం. ఇది మంచి కార్యక్రమం అని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.