విచారణ తుది దశకు తీసుకొస్తున్న సీబీఐ
కడప, (ADITYA9NEWS): మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సంచలన హత్య కేసులో సీబీఐ దూకుడు మరింత పెంచింది. ఒకరకంగా చెప్పాలంటే హత్యకు ఉపయోగించిన ఆయుధాలను గుర్తించే దశకు విచారణ ముమ్మరం చేసింది. (శనివారం) పులివెందుల సమీపంలోని కాలువ వద్ద సీబీఐ సోదాలు చేసింది.
గోవాలో ఇటీవల అరెస్టయిన సునీల్ కుమార్ యాదవ్ అందించిన సమాచారం ఆధారంగా సీబీఐ సోదాలను ప్రారంభించింది. గత రెండు రోజులుగా సీబీఐ అతడిని కడప సెంట్రల్ జైలులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను ప్రశ్నిస్తోంది.యాదవ్ పులివెందులలోని శ్రీ ఆంజనేయ దేవాలయం సమీపంలోని కాలువలో ఆయుధాలను పాతిపెట్టారని సీబీఐకి చెప్పడంతో ఆ దిశగా ఆయుధాల గుర్తింపుకు ప్రయత్నాలు చేస్తోంది.
కావాలనే సిట్ కేసును నాన్చుతుందని వివేకా కుమార్తె సుప్రీం కోర్టుకు వెళ్లడంతో, అక్కడి నుండి సీబీఐ తనపనిని వేగవంతం చేసింది. దాదాపుగా ఈ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో హత్య నిందితులను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుందని వార్తలొస్తున్నాయి.