కారులో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
కాకినాడ,(): తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జిల్లా పరిషత్ సెంటర్‌లో ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా కారు దగ్ధమైంది. అక్కడ ఉన్న ఇండికా కారు నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రధాన సెంటర్‌లో ఉన్న కారు నుండి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు.
దగ్గర్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన చేరుకుని మంటలార్పారు. అయితే అప్పటికే కారు మొత్తం బుగ్గయ్యింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కారులో షార్ట్ సర్క్యూట్‌కు గురైందా, ఎవరైనా కావాలనే కారును తగలబెట్టారా అనేది విచారణలో తేలాల్సి ఉంది.