రూ.3.50 లక్షల నగదుతో కూడిన బ్యాగ్ ను పోలీసులకు అప్పగించిన యువకులు
పెద్దాపురం,(): ఒక్క రూపాయి, కాదు, రెండు రూపాయాలు కాదు. వేలు కాదు.
ఏకంగా 3.5 లక్షల రూపాయాలు. ఎవరో తెలియని వ్యక్తి నగదుతో కూడిన బ్యాగ్‌ను ఏటీయంలో వదిలి వెళ్లిపోయారు. ఆ బ్యాగ్‌ను గుర్తించిన ముగ్గురు యువకలు నిజాయితీగా తిరిగి నగదు బ్యాగ్‌ను సదరు
వ్యక్తికి అందేలా చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగింది. ఈ అరుదైన సంఘటన.. వివరాల్లోకి వెళితే…
పెద్దాపురం అపెక్స్ కంపెనీలో పనిచేస్తున్న సర్ధార్ అనే కాంట్రాక్టు ఉద్యోగి, సిబ్బంది జీతాల నిమిత్తం ఇవ్వాల్సిన, రూ.3.50 లక్షల నగదును డ్రా చేసి బ్యాగులో పెట్టాడు. ఇంతలో అతడికి ఫోన్ రావడంతో కంగారులో బ్యాగ్‌ను ఏటీయం లోపల వదిలి వెళ్లిపోయాడు. అదే సమయంలో అక్కడ నగదు డ్రా చేసుకునేందుకు కోరమండల్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు యువకులు వెళ్లారు. ఏటీయం లోపల నగదు డ్రా చేస్తుండగా , పక్కనే ఉన్న క్యాష్ తో ఉన్న బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే అందులో నగదు ఉండటాన్ని గుర్తించిన యువకులు నేరుగా పెద్దాపురం పోలీస్‌స్టేషన్ కు వెళ్లి పోలీసులకు అప్పగించారు.
ఇంతలోగా బ్యాగ్ మరచిపోయిన విషయాన్ని గుర్తించిన సర్ధార్ కంగారుగా ఏటీయం దగ్గరకు వచ్చి వెతకగా, బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్ పోయిందన్న విషయాన్ని పెద్దాపురం పోలీసులకు తెలియజేశాడు. అయితే
నగదు ఉన్న బ్యాగ్‌ను ముగ్గురు యువకులు తమకు అందించారన్న తీపి వార్తను పోలీసులు సర్థార్‌కు చెప్పడంతో, వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లాడు. పెద్దాపురం ఎస్.ఐ. ఆర్. మురళీమోహన్ నగదు ఉన్న బ్యాగ్ ను సర్థార్‌కు అప్పగించారు. ఎంతో నిజాయితీగా దొరికిన డబ్బును తిరిగి ఇచ్చేసిన యువకులను ఎస్.ఐ, పోలీసు సిబ్బంది అభినందించారు.