బీసీల పార్టీకి బీట‌లు..!

సాధారణంగా ఇప్పుడేమి ఎన్నికలు  లేవు. ఓట్ల కోసం పాకులాడుకునే రోజులు
కావు. మరెందుకు బీసీలపై దాడి జ‌రుగుందంటూ టీడీపీ ఎనలేని ప్ర‌చారానికి
దూకుతోంది.. జ‌గ‌న్ బీసీ మంత్రంతో బీసీల‌లో టీడీపీకి ఉన్న‌ ప‌ట్టు
కోల్పోతోందా..? ఉన్న బీసీ నాయ‌కుల బ‌లం స‌రిపోవ‌డం లేదా అనేది వెయ్యి
నోళ్ల ప్ర‌శ్న‌. బీసీల‌లో సామాజిక ప‌రంగా బ‌ల‌మైన కుల నాయ‌కులు
టీడీపీలోనే కాదు, వైసీపీలో ఉండ‌టం ఇందుకు  కార‌ణం. వైసీపీ రాష్ట్రంలో
బీసీల‌కు అన్యాయం చేస్తుందంటూ ఊక‌దంపుడు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ
అనుకున్నంత‌గా పార్టీకి మైలేజి రావ‌డం లేదు. దీనికి కార‌ణం జ‌గ‌న్
చేస్తున్న ప్ర‌తీ ప‌నిక‌ళ్లేదుట క‌నిపిస్తోంది.

 ఏడాది పాల‌న‌లో వ‌ర‌లా జ‌ల్లుతోపాటు, బీసీ నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు,
కులాల వారీగా హామీల అమ‌లుతో బీసీల‌కు మరింత చేరువవుతున్నాడు.ఇదే
కొన‌సాగితే వ‌ల‌స‌ల బాట పెరిగి బీసీ పార్టీకి‌ బీట‌లు రెట్టింప‌య్యేలా
ఉంది. వాస్త‌వానికి బీసీలంటే టీడీపీ..టీడీపీ అంటే బీసీల పార్టీగా మొద‌టి
నుండి ఉన్న‌దే. ఆ పార్టీకి వ‌స్తున్న‌ ఓటింగ్ శాతంలో ఎక్కువ బీసీలే.
రాష్ట్రంలో కీల‌క ప‌ద‌వులు చేసిన మ‌హామ‌హులంతా టీడీపీలో ఉండ‌టం ఆ
పార్టీకి  మొద‌టి నుండి ఉన్న బ‌లం.

 టీడీపీ వ్యవస్థాపకుడు నంద‌మూరి తార‌క‌రామారావు ‌బీసీలకు పెద్ద‌పీట
వేశారు.  రాజ‌కీయంగా అవ‌కాశాలు క‌ల్పించింది ఆయ‌నే. ఆ త‌రువాత చంద్ర‌బాబు
బీసీ నేత‌ల‌తో  కోట‌రీనే నిర్మించుకున్నారు. యనమల‌ రామ‌కృష్ణుడు,
ఎర్రన్నాయుడు  ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలలో చాలా మందిపెద్ద‌లు పార్టీకి
పెద్ద దిక్కయ్యారు.

ఎర్ర‌న్నాయుడు మ‌ర‌ణానంత‌రం వచ్చిన అచ్చెన్నాయుడు కుటుంబ‌ప‌ర‌మైన
కీర్తితో బీసీ నేత‌గానే చ‌లామ‌ణి అవుతున్నాడు. అయితే కొంత మంది
చంద్ర‌బాబు సిద్ధాంతాలు న‌చ్చ‌కో,  పార్టీలోపెద్ద‌ల టార్చ‌ర్‌కో..మొత్తం
మీద ఇత‌ర నేత‌ల‌తో పాటు, బీసీలలో టీడీపీ నుండి ప‌లువురు పార్టీలు మారారు.
అయిన‌ప్ప‌టికీ  టీడీపీకి మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కూ బీసీ బ‌లం త‌గ్గ‌లేదు.
అయితే  2019 ఎన్నిక‌ల నుండి మాత్రం బీసీల పార్టీకి గ‌డ్డుప‌రిస్థితి
నెల‌కొంది.

 ఒక్క‌సారి జ‌గ‌న్ చూద్దామంటూనే బీసీలు  జ‌గ‌న్ కు
జై కొట్టడం టీడీపీకి ఉహించ‌ని దెబ్బ‌. ఇలా ఒక్క‌సారి
చూద్దామ‌నుకున్నారంటే అంత ప‌ట్టున్న బీసీ పార్టీకి ఎందుకు ప‌ట్టు జారిందో
ఇప్ప‌టికైనా అగ్ర‌నేత‌లు గుర్తించ‌క‌పోవ‌డం మైన‌స్.

తాజా విష‌యానికొస్తే .. ESI స్కామ్‌లో ఏసీబీ అచ్చ‌న్నాయుడిని అరెస్టు
చేసింది.. ఇంకేముంది టీడీపీకీ దొరక్క దొరక్క ఒక పెద్ద ఐట‌మ్ దొరికింది.
బీసీల‌పై దాడి అంటూ ప్రచారంతో  ఊపందుకుంది. జగన్‌ బీసీల‌ను
అణగదొక్కుతున్నాడంటూ విప‌రీత ప్ర‌చారం.

 మొన్నటి వరకూ ఎస్సీ నాయ‌కుల‌ను జైలుకు పంపాడు జ‌గ‌న్‌. ఇప్పుడేమో
బీసీల‌ను తొక్కేస్తున్నాడంటూ  కల‌రింగ్ ఇచ్చింది. పసుపు వార్తల‌ను
ప్రచారం చేయడానికి ఏలాగో ఆ రెండు పత్రికలు ఉన్నాయి కదా..రోజుకో
హెడ్డింగ్‌తో జ‌గ‌న్ ను ఆడుకున్నాయి. కొద్ది రోజులు. కాని అచ్చెన్న‌పై
ప‌డ్డ అవినీతి మరక ముందు ఆ పాచీక పారలేదు.

 మరీ.. జగన్‌ ఏమైనా తక్కువోడా అంటే జగమొండికి కేరాఫ్‌ అడ్రస్‌..
అనుకుంటే చేయాల్సిందే..మాటిస్తే   కట్టుబడాల్సిందే అనే సిద్ధాంతంతో
ముందుకెళ్తున్నాడు.  ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా ఎప్పటి నుండో
ఎదురుచూస్తున్న యాదవుల‌కు(సన్నిధి గొల్ల‌) తిరుమల‌ వేంకటేశ్వరస్వామి
ఆల‌యంలో మీరాసి హక్కును కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
మ‌త్స్య‌కారులు, చేనేత‌ల‌కు వ‌రాలు. మరోపక్క రాజ్యసభ ఎన్నికల్లో బీసీకు
రెండు స్థానాలు కేటాయించారు. దీంతో వైసీపీలో బీసీ నాయ‌కుల‌కు మ‌రింత బ‌లం
చేకూరింది. బీసీల‌కు జగన్‌ అన్యాయం చేస్తున్నాడంటూ  చేస్తున్న
ప్ర‌తిప‌క్షాల  ప్ర‌చారానికి అర్థం లేకుండా పోయింది.

జ‌గ‌న్ తన పార్టీలో  మొద‌టి నుండి ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌,
మోపిదేవి వెంకటరమణల‌కు ఎమ్మెల్సీల ద్వారా మంత్రి పదవుల‌ను తొలి
కేబినేట్‌లోనే ఇచ్చాడు. ఆతరువాత పరిణామాల‌తో మండలి రద్దు నిర్ణయంతో
ఇబ్బంది ఏర్ప‌డింది. కానీ బీసీల నుండి  వీరిద్దరిని రాజ్యసభకు
పంపిస్తారని అప్ప‌ట్లోనే నిర్ణ‌యించ‌డం అదే మాట‌పై నిల‌బ‌డటం జ‌గ‌న్‌కు
బీసీల్లో మ‌రింత ప‌ట్టు పెంచింది. మొదటి నుంచి బీసీలంటే టీడీపీయే అనేది
నానుడిగా ఉండిపోవ‌డంతో వైసీపీలో బీసీల‌కు అంత సీన్‌లేద‌నుకున్నారంతా..

కానీ,  బీసీల‌కు వైసీపీ న్యాయం చేస్తుంద‌న్నంత‌లా జ‌గ‌న్
నిర్ణ‌యాలు బీసీల‌లో  కొత్త ఆలోచ‌న‌కు పునాది వేశాయి. రాబోయే
రోజుల్లో టీడీపీ బీసీల‌ను త‌న వైపు తిప్పుకోవాలంటే  బంగారమే
కురిపిస్తామ‌న్నంత‌గా  చేయాల‌మోనంత‌గా బీసీల్లో మార్పు రావ‌డం టీడీపీకి
 మింగుడు ప‌డ‌టం లేదు.

వైసీపీ అవ‌లంబిస్తున్న బీసీ సంక్షేమం కంచుకోట టీడీపీకి బీట‌లు
వారుతున్నాయి. అందుకే ముందుగా మేల్కొంటున్న టీడీపీ బీసీలపై దాడులు,
కేసులంటూ అర‌చి గీ ..పెడుతుంటే ,బీసీల‌లో కులాల వారిగా గ‌త ప్ర‌భుత్వం
చేయ‌ని ప‌నుల చిట్టా క్లీయ‌ర్ చేయ‌డంలో జ‌గ‌న్ దూకుడు మాములుగా లేదనేలా
ఉంది.

దీంతో చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టుగా అధికారం ఉన్న‌ప్ప‌డు
అల‌త్వం చేసి ఇప్ప‌డు అరిస్తే లాభ‌మేంట‌నేది  టీడీపీ నేత‌లను సైతం
ఆలోచ‌న‌లో ప‌డేసింది. జ‌గ‌న్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మో, లేక వైసీపీకి బీసీల
బ‌లం పెంచుకోవ‌డం కోస‌మో గాని మొత్తానికి బీసీల‌కంటూ జ‌గ‌న్  ప్ర‌త్యేక‌త
చాట‌డం బీసీల పార్టీకి గ‌డ్డుకాల‌మే. రాబోయే కాలంలో పాత బుర్ర‌ల‌కు
ప‌దును  పెట్టి బీసీల పాట పాడ‌క‌పోతే బీట‌లు కాదు…కోట‌లు బ‌ద్ద‌ల‌యినా
ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :