యోగా అనేది ఒక వర్గానికో, ఒక మతానికో లేక ఒక వర్ణానికి సంబంధించినది
కాదని, యావత్తు ప్రపంచానికి మేలు చేసేదని, ఐక్యత చాటేదని ప్రధాని
మోడీ అన్నారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని
ఢిల్లీలో ఆయన ప్రసంగించారు.
ఇంటి వద్ద సామాజిక దూరం పాటిస్తూ యోగా చేయాలన్నారు. ప్రాణాయామంతో
కరోనాను కట్టడి చేయవచ్చన్న ప్రధాని, ప్రజలంతా ఐక్యతతో
ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి
రామ్నాథ్ కోవింద్ యోగా చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్పూర్ వద్ద
ఐటీబీటీ దళం యోగా చేసి ఐక్యత చాటారు.
