భార్య పై రేప్..భర్త కాపలా..!


కట్టుకున్న భర్తే భార్యని రేప్ చేయించిన అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్యపై తన  స్నేహితుడు అత్యాచారం చేస్తుంటే ఆ నీచుడు ఏమాత్రం సిగ్గులేకుండా గది బయట కాపలా కాసాడు. రాజస్తాన్ లోని ఆళ్వార్ జిల్లా షాజహాన్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. ఆ వివాహిత(35)ను ఆమె భర్త… మార్కెట్‌కు వెళ్దామని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు.

దారిలో తన ఫ్రెండ్ మిచ్చు అలియాస్ బల్వంత్ ధనక్‌ను వెంట తీసుకెళ్లాడు. భార్య ఉండగానే అతన్ని కూడా అదే బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బైక్ ఆపాడు. అక్కడ కొద్దిసేపు కూర్చున్న అనంతరం బల్వంత్ సడెన్‌గా లేచి ఫ్రెండ్ భార్య చేయి పట్టుకుని సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లాడు.  అక్కడ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్యను ఫ్రెండ్‌కు అప్పజెప్పిన భర్త… ఆమెపై అత్యాచారం జరుగుతుంటే… అటువైపు ఎవరూ రాకుండా గది బయట కాపలా కాశాడు.

ఈ దారుణ ఘటనతో బాధితురాలు షాక్‌కు గురైంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భర్త, అతని స్నేహితుడు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని కన్వాళ్లకు చెప్పుకుని భోరుమంది. వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :