విశాఖలో మరో గ్యాస్ లీకేజీ

ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది.   పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో విషవాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కె మీనా పరిశీలించారు. మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు కంపెనీ ప్రతినిధులు తరలించారు. ప్రమాదం రాత్రి  11:30 కు జరిగితే కంపెనీ సిబ్బంది మూడు గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :