ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తరువాత సోము వీర్రాజు ఒకొక్కరిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన వీర్రాజు తాజాగా జనసేన కార్యాలయానికి వెళ్లి, పవన్ ను కలుసుకున్నారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ తో పొత్తులో ఉన్న పవన్‌తో కొత్త బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు కలయికతో బీజేపీ-జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.