ఈఏడాదిలో రైతాంగానికి ఉహించని దెబ్బ తగిలిందని రైతులు నష్టపోయారని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో ఆయన పలు వరద ముంపదు ప్రాంతాలను కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి కన్నాబాబు రైతుల ఎదుర్కొంటున్న పరిస్థితులపై మాట్లాడారు.
గత మూడు నెలల్లో తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలం ఆగష్టులో గోదావరి వరద వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్‌లో ఏలేరు వరద నీరు వల్ల కొంత నష్టం జరిగింది. ఇక అక్టోబర్‌లో పరిస్థితి చెప్పలేనంతగా వరదలు ముంచెత్తాయని రైతుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
ఏలేరు ఆధునికీకరణపై ఇరిగేషన్‌శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏలేరు వరద ఉధృతి తగ్గిన వెంటనే పూర్తిస్థాయిలో పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయాధికారులను ఆయన ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడ ఎంపీ గీత పిఠాపురం రైతుల కష్టాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వం ద్వారా త్వరితగతిన సాయం అందేలా చూడాలని ఆమె మంత్రిని కోరారు.
