అమ్మ జ్ఞాపకంగా నిరుపేదలకు చీరలు పంపిణీ

అమ్మ జ్ఞాపకంగా నిరుపేదలకు చీరలు పంపిణీ

కల్లూరు ఏప్రిల్ 05 ( జై తెలంగాణ న్యూస్ ) :

తల్లిదండ్రులకు మించిన దైవం లేదని భావించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం నిరుపేదలకు ఆర్థిక సహాయంతో పాటు వృద్ధులకు, వితంతువులకు చీరలు పంపిణీ చేస్తున్న బీరవల్లి నరసింహ, పుల్లమ్మ దంపతుల తనయులు ప్రముఖ పారిశ్రామికవేత్త బీరవల్లి శ్రీనివాసరావు, మండల ఎంపీపీ బీరవల్లి రఘు. తన తల్లి బీరవల్లి పుల్లమ్మ 11వ వర్ధంతి సందర్భంగా తమ స్వగ్రామైన యర్రబోయినపల్లిలో శుక్రవారం గ్రామస్తులకు అన్నదానం తో పాటు 500 మంది వితంతువులకు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఈ లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులేనని వారి రుణాన్ని ఎన్ని కోట్లు పంచిన తీర్చలేమని అన్నారు.మా జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారు పడ్డ శ్రమ వర్ణనాతీతం. ఉన్నతంగా ఎదిగిన వారి జ్ఞాపకాలను మరువలేకనే ప్రతి ఆడపడుచులో మా తల్లిని, ప్రతి వ్యక్తి లో తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గత 11 సంవత్సరాలుగా మాకు చేతనయినంత ఆర్థిక సహాయం తో పాటు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో వారి జ్ఞాపకార్థం మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :