పిల్ల‌ల చాక్లెట్‌కు రెండు రూపాయ‌లు ఇవ్వ‌లేక‌పోతున్నాం..

* చెత్త ప‌న్నులెలా క‌డ‌తాం

* క‌ర్నూలులో చెత్త ప‌న్ను వ‌సూళ్ల‌కు వెళ్లిన సిబ్బందికి షాక్ ఇచ్చిన మ‌హిళ‌లు

క‌ర్నూలు, (ADITYA9NEWS) : చిన్న పిల్ల‌లు చాక్లెట్‌కు రూ.2 ఇవ్వ‌లేక‌పోతున్నాం. అలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ఈ చెత్త ప‌న్నుకు డ‌బ్బులు ఏలా ఇవ్వ‌గ‌ల‌మంటూ ఓ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. క‌ర్నూలులో పాత‌న‌గ‌రం ప్రాంతంలో ఇంటింటికి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌డానికి వెళ్లిన సిబ్బందికి ఓ మ‌హిళ ఘాటుగా స‌మాధానం ఇచ్చింది.

అస‌లు అన్నం తిన‌డానికి డబ్బుల్లేని క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉన్నాం. డ‌బ్బులు ఏలా వ‌స్తాయి. మీరేమో ఇంతింత ప‌న్నులు వేస్తున్నారు. ఇది మీకు భావ్యం కాదంటూ సిబ్బందికి బ‌దులిచ్చారు. మీరంటే ఉద్యోగులు కాబ‌ట్టి మీకు రూ.60 లెక్కుండ‌దు, కాని పేద కుటుంబాల‌ను అర్థం చేసుకోవాలంటూ ఆమె ప‌న్ను ఇవ్వ‌లేమ‌ని తెగేసి చెప్ప‌డంతో, స‌చివాల‌య‌ సిబ్బంది కంగుతిన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :