రామ్మోహన్నాయుడుకి సంసద్‌ రత్న అవార్డ్‌

శ్రీకాకుళం ఎంపీ కింజ‌రా‌పు రామ్మోహన్‌ నాయకుడుకి సంసద్‌ రత్న పురస్కారం లభించింది. అతి పిన్నవయసులోనే ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. పార్లమెంట్‌ సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరును గుర్తించి ఈ పురస్కారం అంద‌జేశారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంపీలు చూపించే చొరవ, ప‌నితీరుకు ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌, శ్రీరంగ్‌ అప్పా బర్నే, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ఎంపిక ఈ అవార్డు ఎంపిక‌కు దేశంలో పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను, రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. వీరిలో ఎనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

2020 సంవ‌త్స‌ర‌పు సంసద్‌ రత్న విజేతలు వీరే

లోక్‌సభ సభ్యులు

* రామ్మోహన్‌ నాయుడు (ఆంధ్రప్రదేశ్‌)

* సుప్రీయ సూలే (మహారాష్ట్ర)

* సుభాష్‌ రామ్‌రావ్‌ భ్రమే (మహారాష్ట్ర)

* మీనా విజయ్‌కుమార్‌ గవిట్‌ (మహారాష్ట్ర)

* అమోల్‌ రామ్‌ సింగ్‌ కోలే (మహారాష్ట్ర)

* శశి థరూర్‌ (కేరళ)

* నిశికాంత్‌ దూబె (ఝార్ఖండ్‌)

* అజయ్‌ మిశ్రా (ఉత్తర్‌ ప్రదేశ్‌)

రాజ్యసభ సభ్యులు

* విశంబర్‌ ప్రసాద్‌ నిషాద్‌ – రాజ్యసభ (ఉత్తర్‌ప్రదేశ్‌)

* చాయా వర్మ – (ఛత్తీస్‌గఢ్‌)

* పీసీ గద్దిగౌడర్‌ (వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌)

ఇక గత లోక్‌సభకు సంబంధించి సంసద్‌ మహారత్న పురస్కారాలు కూడా వెల్లడించారు. భర్తృహరి మహతాబ్‌ (ఒడిశా), సుప్రియ సూలె (మహారాష్ట్ర), శ్రీరంగ్‌ అప్పా బర్నే (మహారాష్ట్ర) ఈ పురస్కారాలకు ఎంపిక‌య్యారు. 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :