రష్యాలో జరిగిన 75వ విజయోత్సవ పరేడ్‌లో భారత్‌కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం పాల్గొంది.మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహించిన సైనిక పరేడ్‌లో భారత్ దళాలు కవాతు నిర్వహించాయి. 1941-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా తమ దేశభక్తిని చాటుతూ రష్యా ప్రతి ఏటా విజయోత్సవ పరేడ్‌ను జరుపుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది 75వ విజయోత్సవ పరేడ్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. భారత్ తరుఫున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రతిష్ఠాత్మక పరేడ్‌కు హాజరయ్యారు.
భారత్‌కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం ఈ పరేడ్‌లో పాల్గొనడం గర్వంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్, ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆ దేశ పాలకులతో చర్చలు జరుపనున్నారు.
