తూర్పుగోదావరిజిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలుల హైవేకు ఆనుకుని ఉన్న ఉన్న ఆదర్శ ఇంజనీరరింగ్ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఈనెల 21, సోమవారం నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో 1050 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జీతం-రూ. 9 వేల నుండి రూ.20 వేలు, అర్హత-10వ తరగతి నుండి ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీత, ఐటీఐ వంటి సాంకేతిక కోర్సులు చదివిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. జాబ్‌మేళాకు హాజరయ్యే వారు ఎటువంటి రుసుము చెల్లించనవసరలేదని నిర్వాహకులు తెలిపారు. ఒరిజనల్ సర్టిఫికెట్‌లతోపాటు, జిరాక్్స కాపీలు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు.
కంపెనీలు ఇవే..
జాబ్‌మేళా ద్వారా కింది కంపెనీలలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో HCL, TATA, RSMIPL, HETRO,FABIN,Dreamway, MOBIS, dsc, indigo, LGD IT SOLUTIONS వంటి తదితర కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. వివరాలకు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వికాస సంస్థ ఫోన్ 0884- 2352767, 2352765 లను సంప్రదించవచ్చు.