ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు,ఒపీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ ) పారితోషకాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో 1,145 ప్రాథమిక(PHC), 195 సామాజిక(CHC), 28 ప్రాంతీయ(RHC)లతోపాటు కొన్ని జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రులలో అందుతున్న సేవలను బట్టి మార్కులు కేటాయిస్తారు. ఎన్‌క్వాస్ పారితోషకం అందుకునేందుకు ప్రస్తుతం 1010 ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. వీటిలో 800 వరకూ పిహెచ్‌సీలు ఉన్నాయి. వీటిని అధికారులు పరిశీలించి అవార్డుకు ఎంపికచేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి/ మార్చి నాటికి ఈ అవార్డుల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
