తూర్పుగోదావరి జిల్లాలో 227 వాలంటీరు పోస్టుల భర్తీకి జిల్లా జాయింట్ కలెక్టర్(సచివాలయ) కీర్తి తెలిపారు. వివరాలను gswsvolunteer.apcfss.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈనెల 20 నుండి 24వ తేది లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్/ ఎంపీడీవోల ఆధ్వర్యంలో మండల పట్టణ కమిటీలు వాలంటీర్ల ఎంపిక చేపడతాయని వివరించారు. ఆసక్తి గల 35 సంవత్సరాల లోపు పురుష/మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.