* డెంటల్ డాక్టర్ల పోస్టుల భర్తీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 31 పోస్టులకుగాను 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రిలిమినరీ జాబితా ప్రకటించి సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో డెంటల్ డాక్టర్లను నియమించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
* డీఎడ్ సెకండీయర్ పరీక్షలు ఈనెల 23 నుండి 31 వరకూ జరగనున్నాయి.హాల్‌టిక్కెట్లు www.bse.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* జగనన్న విద్యా దీవెన రెన్యువల్ ఈనెల 30వ తేది వరకూ గడువును పొడిగించారు. ఈ పథకంలో కొత్తగా చేరేవారికి మాత్రం ఈనెల 21 నుండి అవకాశం కల్పించారు. కాలేజీల్లో చేరిన వారైతే చేరిన 20 రోజుల నుండి ఈపథకానికి అర్హులని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* సంక్రాంతికి ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 8 నుండి 13వ తేది వరకూ ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, విశాఖ మీదుగా బస్సులు తిరగనున్నాయి.
* ఈఎన్‌టీ(చెవి,ముక్కు, గొంతు) సేవలు త్వరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ సోమవారం ఈసేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణనిస్తున్నారు.