గురుద్వారాలో మోదీ

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత బోధకుడు గురు తేజ్ బహదూర్ కు నివాళులు అర్పించారు. ఆయన త్యాగాలను స్మరించున్నారు.ప్రధాని పర్యటనలో భాగంగా ఎలాంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, ట్రాఫిక్ ను కూడా నిలిపివేయలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటన ప్రధాని షెడ్యూల్ లో లేదని తెలిపాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తోన్న నేపథ్యంలో మోదీ గురుద్వారా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :