నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలన్న మంత్రిమండలి సిఫారసును ఆదేశ ప్రధాని కె.పి.శర్మ ఓలి రాష్ట్రపతికి పంపించన వెను వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రధాని నిర్వహించిన అత్యవసర భేటీలో మంత్రి మండలి పార్లమెంట్ రద్దు నిర్ణయానికి వచ్చిందని మంత్రి బార్సామన్ పున్ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ నేత నారాయణ్‌కాజీ మాత్రం తప్పుపట్టారు. మంత్రులందరూ లేకుండానే నిర్ణయం తీసుకున్నారని నారాయణ్‌కాజీ ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం తగదని, మంత్రిమండలి నిర్ణయం నేపాల్ తిరోగమనానికి దారితీస్తుందని నారాయణ్‌కాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రిమండలి నిర్ణయం అమలు కాదని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఉన్న నారాయణ్‌కాజీ వాదిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.