గొల్ల‌కురుముల‌కు ఆర్థిక చేయూత

*మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్*

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న గొల్ల‌కురుముల‌ను ఆర్థికంగా ఆదుకుని చేయూత‌నిస్తామ‌ని రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌కశాఖా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ హామీ ఇచ్చారు. ట్యాంక్ మినిస్టర్ ఛాంబర్ లో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్వ‌యంగా క‌లిసి విన‌తి పత్రం అందించారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ..

రాష్ట్రం లో ఉన్న గొల్ల కురుమల కు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్ధేశ్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొర్రెల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈసంద‌ర్భంగా గొల్ల‌కురుము సంఘం నాయ‌కులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్సూరెన్స్ పెంచిన గొర్రెల‌ను అమ్ముకునే స‌దుపాయం, ద‌ళారీ వ్య‌వ‌స్థ నిర్మూల‌న, గొర్రెల సీజ‌న‌ల్ వ్యాధుల‌కు మందులు పంపిణీ వంటి అంద‌జేయాల‌న్నారు. స్పందించిన మంత్రి స‌మ‌స్య‌ల‌ను తీరుస్తామ‌ని హామీ ఇచ్చారు.

మంత్రి త‌ల‌సానిని క‌లిసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడి రఘునాథ్ యాదవ్, జిల్లా యాదవ సంఘం సీనియర్ నాయకులు ఒ. శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ జీడి కంటి మహేందర్ యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షులు దొంతి పోయిన శ్రీనివాస్ యాదవ్, అందేలా సత్యనారాయణ యాదవ్ , ప్రభాకర్ యాదవ్ , శంషాబాద్ యాదవ సంఘం నాయకులు నగేష్ యాదవ్ ,వెంకటేష్ యాదవ్ కొమరవెల్లి మోహన్ యాదవ్, కుమార్ యాదవ్ రమేష్ యాదవ్ మొయినాబాద్ మండల్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, రఘు యాదవ్, అశోక్ యాదవ్, నర్సింగ్ యాదవ్ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ యాదవ్, వెంకటేష్ యాదవ్ ,రేణుకేశ్ యాదవ్ సంతోష్, యాదవ్ రంగారెడ్డి జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :