గుంటూరు (ADITYA9NEWS): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లోస్టాఫ్ నర్స్ లను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 17 స్టాఫ్ నర్స్ పోస్టులను ప్రాథమికంగా భర్తీకి నిర్ణయించిన ఉన్నతాధికారులు తొలుత డిసెంబర్ 29న వీరి ఎంపికకు ఇంటర్య్వూ తేదిని ఖరారు చేశారు. మరలా పరిపాలన కారణాల దృష్ట్యా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓ పరీక్ష నిర్వహించి రిక్రూట్‌మెంట్ చేయాలని నిర్ణయానికి రావడంతో ప్రస్తుతం నియామక పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈపరీక్ష ఎప్పుడు చేపడతారనేది తెలియజేస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఓప్రకటన ద్వారా తెలిపారు. వివరాలకు www.apswreis.info వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.