రాజమహేంద్రవరం(ADITYA9NEWS): రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా కార్యదర్శిగా తుళ్లి పద్మావతి యాదవ్‌ను నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు) ఆధ్వర్యంలో నూతన మహిళా కమిటీ సభ్యులను రాజమహేంద్రవరం లో తిలక్‌రోడ్డులో ఉన్నటీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మహిళా కమిటీకి పలు సూచనలు చేశారు. అనంతరం మహిళా కమిటీ కార్యదర్శిగా నియమితులైన పద్మావతి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మాకానికి తగ్గట్టుగా సేవలందిస్తానన్నారు. పెద్దలు, సీనియర్ల సూచనలు తీసుకుని ముందుకెళ్తానని, టీడీపీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. మహిళా కమిటీ సభ్యులను పార్టీ సినియర్ నాయకులు, మహిళా నాయకులు అభినందించారు.
