పిఠాపురం (ADITYA9NEWS): వివాహమంటే హంగులు, ఆర్భాటలు. కొందరైతే రాజకీయ నేతల రాక కోసం హడావుడి. విందు, వినోదం ఎక్కడైనా వివాహంలో ఇవన్ని సర్వసాధారణం. కాని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ వివాహ జంట తీసుకున్న నిర్ణయం అందర్ని ఆలోచనలో పడేసింది. తమ పెళ్లికి వచ్చిన బందువులు, అతిధులు రక్తదానం చేయాలని కోరిన ఆజంట, వివాహంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తికట్టించింది…వివరాల్లోకి వెళితే..
పిఠాపురం పట్టణం వెలంపేటకు చెందిన దయాసాగర్, పద్మసాయి కృష్ణవేణిల వివాహాం ఆదివారం పిఠాపురం పెద్దబజారులో ఉన్న రామకృష్ణా కళ్యాణ మండపంలో జరిగింది. వీరి వివాహానికి వచ్చేవారు రక్తదానం చేయాలని వారు కోరారు. శుభలేఖలో ఈ విషయాన్ని ముందుగానే తెలిపారు. అందుకు తగ్గట్టుగా వివాహా వేదిక వద్ద రెడ్ క్రాస్ సంస్థ, చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎమ్.రవికుమార్, సభ్యులు ఆలీమ్, శివ, అజహార్, చామంతి నాగేశ్వరరావు, వాకాడ వెంకట రమణ, పవన్ కల్యాణ్, నాగేంద్ర, శ్రీమన్‌ల సహకారంతో రక్తదాన శిబిరాన్నిఏర్పాటు చేశారు.
35 మంది వేదిక వద్ద రక్తదానం చేశారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కో-ఆర్డినేటర్‌గా ఉన్న దయాసాగర్ ఆలోచనను, అతడి నిర్ణయాన్ని అంగీకరించిన పెళ్లికూతురు పద్మసాయి కృష్ణవేణి సేవాస్పూర్తిని బంధువులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తారు.