ముట్టడికి మాత్రం జనసేన సిద్ధం : పవన్
మచిలీపట్నం(ADITYA9NEWS): వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, అలా చేయని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడికి జనసేన ఎంత మాత్రం వెనకాడదని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన కార్యకర్తలు,రైతులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో జిల్లా రెవిన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. రైతులకు మేలు జరగనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎవరికి ప్రయోజనం. అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రతీ రైతుకు రూ.35 వేలు నష్టపరిహారం అందివ్వాలంటూ పవన్ పట్టుబట్టారు. మీ అసెంబ్లీ ఎక్కడ ..? విశాఖ, విజయవాడ, లేక పులివెందులా ? మీరు ఎక్కడ అసెంబ్లీ పెట్టుకున్న జనసేన మాత్రం ముట్టడిస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి హెచ్చరించారు. గుడివాడలో పవన్‌కు ఘన స్వాగతం పలికారు జనసేన అభిమానులు.
ఇక్కడ ఎమ్మెల్యే ఎవరూ నాని నా..వైసీపీలో నానిలెక్కువ, శతకోటి లింగాల్లో బోడి లింగాల్లాగ, శతకోటి నానిల్లో నాని ఒకడంటూ మంత్రి నాని పై పవన్ సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.