ఎవ‌రిని నిందించ‌గ‌లం..

భార‌త‌దేశం ఓ రంగుల ప్ర‌పంచం..స‌హ‌జ వ‌న‌రులకు పుట్టినిల్లు..ఎన్నో దేశాల‌కు ఆద‌ర్శం. అభివృద్ధి చెందుతున్న దేశాల‌లో అగ్ర‌స్థానం. భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి, ఇది మొన్న‌టి వ‌ర‌కూ. నేడు మొత్తం త‌ల‌కిందులైంది. భార‌త్ అంటే భ‌యం పుడుతోంది. కొన్ని దేశాలు ఏకంగా మ‌న‌ల్ని చూసి జాలిప‌డుతున్నాయో, హేళ‌న చేస్తున్నాయో కూడా తెలియ‌ని విధంగా ప‌రిస్థితి మారింది.ఎందుకిలా .?ఎవ‌రిని నిందించ‌గ‌లం

సుమారు 130 కోట్ల జ‌నాభా ఉన్న భార‌త్ నేడు క‌రోనాతో విల‌విలాడుతోంది. ఉద‌యం లేస్తే చావు క‌బురు త‌ప్పితే మ‌రోక‌టి లేదు. రాష్ట్రాల‌న్ని దిగాలుగా మారిపోయాయి. నేత‌లు నోళ్లేల్ల‌బెడుతున్నారు. ఏం జ‌రుగుతుందో. ఏలా ముంచుకోస్తుందో అర్థం కాని దుస్థితి. ఒక్కొ ఛాన‌ల్ ఒక్కొ వార్త‌. బెద‌రాలో, అద‌రాలో కూడా తెలియ‌ని నిస్స‌హాయ‌తలో స‌గ‌టు మ‌నిషి కొట్టుమిట్టాడుతున్నాడు. దావాఖ‌నాల దారుల‌న్ని మూసుకుపోయాయి. సామాన్యుడికి ఆసుప‌త్రే మృత్యుపాశ‌మ‌య్యింది. అటు ఊపీరాగిపోతుంది. ఎదురుగా నిలువ నీడ కాదు క‌దా, గుక్కెడు నీళ్లిచ్చేవాడే క‌రువ‌య్యాడు. అయ్యో పాపం అనే మాట అనంత‌మైంది. జాలి, ద‌యలు ఊరు వాడ‌లా పెరిగాయి. అన్ని ఉన్నా నేనున్నాననే సాహ‌సం మాత్రం ఏమైపోయిందో అర్థం కావ‌డం లేదు. ఎవ‌రి ప్రాణం వారికి తీపే క‌దా..! ఎవ‌రిని నిందించ‌గ‌లం

ఇన్నేళ్ల చ‌రిత్ర క‌లిగిన నా భార‌త దేశం ఇలా అయిపోతుందా, దేవుడా నీవే దిక్కు అనే నిట్టూర్పుతప్పితే ఎవ‌రూ చేస్తున్న‌దేమి లేదు. క‌న్న‌వాళ్లు క‌ళ్ల‌ముందే రాలిపోతున్నారు. క‌ట్టుకున్న‌వాడు క‌నుమ‌రుగైపోతున్నాడు. అమ్మా..నాన్న అనే హృద‌యవిదార‌క విషాద వ‌ద‌న్నాలే అన్నింటా. సామాన్యుడి బ‌తుకుభార‌మైపోయింది. ఈనేల ఇంక మోయ‌నంటుంది. బ‌తికితే అదృష్టం..పోతే ప‌రమార్థం అన్న‌ట్టుగానే ఉంది లోకం తీరు..ఎవ‌రిని నిందించ‌గలం

ప్ర‌స్తుతం ఏం చేసినా చేయ‌కపోయినా పాల‌కుల‌కు నింద‌లు త‌ప్పితే మిగిలేదేమి లేదు. ఎందుకంటే మృత్యుఘోష అలా ఉంది. ఆసుప‌త్రుల్లో బెడ్లు లేవు. సూది మందు దిగితే చాలు బ‌తుకుతామ‌న్న ఆశ తప్పితే చెప్పుకోద‌గ్గ‌ది లేదు. ప్రైవేటు ఆసుప‌త్రులు ల‌క్ష‌లు గుంజుతున్నాయి. అడ్డుకునేవాడు లేడు, ఆదుకునేవాడు అంత‌కంటే లేడు. కాటికాపరి కూడా అల‌సిపోతున్నాడంటే పరిస్థితి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమందు వ‌చ్చేస్తోంది. ఈ మందు సిద్ధ‌మ‌వుతోందన్న ఆశ త‌ప్పితే బ‌తుకు మీద అంద‌రికీ అడియాస‌లే. కోట్లు ఉన్నవాడైనా కూలీ ప‌నోడిదైనా ఒక్క‌టే ప్రాణం. .నిలిస్తే భూమి మీద నూకలున్న‌ట్టు లేక‌పోతే ముగిసిన‌ట్టు..ఎవ‌రిని నిందించ‌గ‌లం…ఎవ‌రి బ‌తుకు వారిదే…ADITYA9NEWS

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :