కాకినాడ,(ADITYA9NEW): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్న జేఎన్టీయూ ఇన్ఛార్జి వైస్ఛాన్సలర్గా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రను నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ జేఎన్టీయూ వీసిగా పనిచేసిన ఎమ్.రామలింగరాజు నియామకం చెల్లదంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి వీసిగా పనిచేసిన రామలింగరాజును గవర్నర్ తప్పించారు. ఇన్ఛార్జి వీసిగా సతీష్చంద్రను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సతీష్ చంద్ర ఉన్నత విద్యామండలి ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
