భార‌త్ చేరుకున్న రెండో విడ‌త ర‌ష్యా టీకా

హైదరాబాద్‌(ADITYA9NEWS): రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కరోనా టీకాలు భారత్‌కు చేరుకున్నాయి. తొలి విడ‌త‌లో 1.50 ల‌క్ష‌ల డోసులు మే 1న రాగా, రెండ‌వ‌ విడతగా సుమారు 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. భార‌త్ – ర‌ష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతోందని ర‌ష్యా రాయ‌బారి నికోలాయ్ కుడ‌షేవ్ ఈసంద‌ర్భంగా అన్నారు. రష్యాల్లో 2020 ద్వితీయార్ధం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

కరోనాను ఏదుర్కొవ‌డ‌మే కాక‌, కొత్త వైరస్‌ రకాలపైనా ఈ టీకాల పనిచేస్తుందని స్ప‌ష్టం చేశారు.
భారత్‌లో దీని తయారీని దశలవారీగా ఏడాదికి 850 మిలియన్‌ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కేవ‌లం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను
త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు.
రాబోవు కాలంలో స్పుత్నిక్ -వి ప్ర‌భావం మ‌రింత‌గా ఉండ‌బోతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :