జీవో.347 విడుదల చేసిన సర్కార్
అమరావతి,(ADITYA9NEWS): ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే దహన సంస్కారాలకు ఇకపై వారి బంధువులుగాని, కుటుంబసభ్యులు గాని ఇబ్బందులు పడకుండా రూ.15 వేలు నగదును అందించి ఆ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీవో. 347 విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులిచ్చారు.
కోవిడ్‌తో మృతి చెందిన వివరాలు కలెక్టర్‌కు పంపించాలి. రాష్ట్ర ఆరోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. దహన సంస్కారాలకు సంబంధిత ప్రాంతాలలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సమాచారం తీసుకుని సంబంధిత మృతుల దహన సంస్కారాలకు రూ.15 వేలు అందివ్వనున్నారు.