కరోనా కట్టడికి అత్యద్భుతంగా పనిచేస్తున్న ఫైజర్ వ్యాక్సిన్ పై ఇప్పటి వరకూ ఐరోపా దేశాలతోపాటు, భారత్ ఎదుర్కొన్న ఇబ్బందులు దాదాపుగా తొలగిపోయాయి. ఫైజర్ సమర్థవంతంగా పనిచేసినప్పటికీ వ్యాక్సిన్ నిల్వ సామర్థ్యంపై కొన్ని దేశాలకు ప్రతికూల వాతావరణం నెలకొంది. సాధారణంగా ఫైజర్ వ్యాక్సిన్ -80 డిగ్రీల నుండి -60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి.
ఆ పరిస్థితులు భారత్‌లో లేవు. పైగా కేవలం 5 రోజుల పాటు మాత్రమే వ్యాక్సిన్ నిల్వ ఉంచాల్సి వచ్చేది. దీంతో వ్యాక్సిన్ వినియోగంలో ప్రతికూలత ఏర్పడింది. అయితే తాజాగా నిల్వ సామర్థ్యం -15 నుండి -25 డిగ్రీల వరకూ తీసుకొచ్చారు. దీంతోపాటు వ్యాక్సిన్ సాధారణ ఫ్రిజ్‌లో నెలపాటు నిల్వ ఉంచవచ్చని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఫైజర్‌లో వచ్చిన ఈ మార్పులతో భారత్‌లో ఫైజర్‌పై ఆసక్తి పెరిగింది.
(ADITYA9NEWS)