సచివాలయాల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు
అమరావతి, (ADITYA9NEWS) : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు 90 శాతం ఉంటేనే వారికి జీతాలు చెల్లించాలని తాజాగా కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇందుకోసం బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్లకు వచ్చిన ఆదేశాలలో ఇంకా ఏమున్నాయంటే..
* ఖచ్చితంగా డిప్యూటేషన్లు రద్దు చేయాలి. సచివాలయం ఉద్యోగి ఉండి పోలీస్ స్టేషన్లు, వెటర్నరీ ఆసుపత్రులు, సంక్షేమశాఖలు, ఇతర వాటిలో విధులు నిర్వర్తిస్తున్నవారంతా తిరిగి వెనక్కి వచ్చేయాలి. ఆయా వార్డు / గ్రామ సచివాలయంలోనే విధులు నిర్వర్తించాలి.
* ప్రతీరోజూ సాయంత్రం సచివాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించాలి. సాయంత్రం వెళ్లేటప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లాలి.
* అత్యవసరమని బయటకు వెళితే , ఎక్కడకు వెళుతున్నామనేది మూమెంట్ రిజిస్ట్రర్ లో రాయాలి. ఎట్టిపరిస్థితులో ఉదయం బయోమెట్రిక్ వేసిన ఉద్యోగి , సాయంత్రం కూడా విధులు ముగించిన తరువాత బయోమెట్రిక్ హాజరు వేయాలి.
* 90 శాతం కంటే ఉద్యోగుల హాజరు తక్కువ ఉంటే సంబంధిత ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలి.