-
న్యాయవాది సొసైటీ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిచిన లక్ష్మి
జై తెలంగాణ న్యూస్ _ ఖమ్మం లీగల్ ఏప్రిల్ 16
ఉత్కంఠ భరితంగా జరిగిన న్యాయవాద సహకార సంఘం 4 డైరెక్టర్ ల పదవులకు మంగళవారం జరిగిన ఎన్నికల లో మొత్తం ఓట్లు 472 ఓట్లు కు గాను 380 ఓట్లు పోలైనాయి. ఈ ఎన్నికల లో 6 గురు అభ్యర్థులు పోటీపడ్డారు ఈ ఎన్నికల్లో పలివేల శ్రీలక్ష్మి కి 292, ఓట్లు పోలు అయినయి. మిగతా అభ్యర్థులకు నరసింహారావు 242 ఓట్లు,భూక్య రమేష్ 219 ఓట్లు, శ్రీనివాసు గుప్తా 208, ఓట్లతో గెలిచారు. అపోజిషన్ అభ్యర్థులకు పోలైన ఓట్లు, శతారావు 197 ఓట్లు, మల్లికార్జునరావు 151, పోల్ అయినాయని ఎలక్షన్ ఆఫీసర్ జి రమేష్, ప్రకటించినారు. అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కే శేఖర్ రాజ్, కే రవి కుమార్, ఎన్ రమాదేవి, పి లలిత, షేక్ నసీరీన్, ఆర్ పాయల్, సహకరించారు. గెలిచినవారు ఓట్లు వేసిన న్యాయవాదులకు, ధన్యవాదములు తెలిపారు.