అభ్యర్థులకు బిఫారాలు అందజేసిన చంద్రబాబు
అమరావతి ( జై తెలంగాణ న్యూస్ )
ఎన్నికల్లో పోటీ చేసే ఎంఎల్‌ఎ, ఎంపి అభ్యర్థులకు టిడిపి అధినేత చంద్రబాబు బిఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బిఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్ధేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. బి`ఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేశ్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.