ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపిద్దాం

ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపిద్దాం

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య

జై తెలంగాణ న్యూస్, మంచిర్యాల జిల్లా బ్యూరో

 

ఇండియా కూటమి బలపరిచిన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపిద్దామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం గోమాస ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో, ఒక స్థానం భువనగిరిలో సిపిఎం పార్టీగా పోటీ చేస్తున్నదని, మిగిలినటువంటి 16 స్థానాలలో ఇండియా కూటమిలో అంతర్భాగంలో భాగంగా కాంగ్రెస్ ను బలపరచాలని సిపిఎం పార్టీగా నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వంశీకృష్ణ కు సంపూర్ణ మద్దతును సిపిఎం పార్టీ తెలియజేస్తుందని అన్నారు. అలాగే ఎన్నికల క్యాంపియన్లో సిపిఎం శ్రేణులు, ప్రజాసంఘాలు పెద్ద మొత్తంలో ఎన్నికల క్యాంపన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని కార్పొరేట్లకు ప్రభుత్వ రంగాన్ని కట్టబెట్టిందని, ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా విద్వాసం చేస్తుందని తెలిపారు. అదేవిధంగా మతోన్మాద ఏజెండాను ముందుకు తీసుకువచ్చి భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి, మనుస్మృతిని, చాతుర్ వర్ణ వ్యవస్థను తీసుకురావాలని, పరోక్షంగా ఆర్ఎస్ఎస్ కనుసందాలలో ప్రధానమంత్రి మోడీ పని చేస్తున్నారని, అందుకోసం ఈ దేశాన్ని రక్షించుకోవాలన్న, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలని, మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారని, రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారని, ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వలేదని అన్నారు. కేంద్రంలో మంత్రివర్గం లేదని, కులగణన చేపట్టకుండా కేంద్రం అడ్డుకుంటుందని అన్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దుచేసి, నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికుల హక్కులను లేకుండా చేస్తుందని, అందుకోసం రైతులు, కార్మికులు, ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అందరు కూడా బిజెపిని ఓడించడానికి ముందుకు రావాలని అన్నారు. సిపిఎం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఇక్కడ పెద్దపల్లి నుంచి వంశీకృష్ణను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి రాజేశ్వరి, ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, బొడెంకి చందు, రాజారాం, దూలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :