భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా టీవర్క్స్
ఏప్రిల్ 29 ( జై తెలంగాణ న్యూస్ ) సిటీబ్యూరో:
సిటీబ్యూరో: భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీవర్క్స్‌లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి క్యాంపులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉత్పత్తుల తయారీ విధానంపై వర్క్‌షాపులను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శనివారం నుంచి హైదరాబాద్, చైన్నె నగరాల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ సంస్థలతో కొత్త ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా స్మార్ట్ వియరబుల్స్‌పై నిపుణులతో శిక్షణనిచ్చారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు టీ వర్క్స్ వేదికగా కొత్త ఉత్పత్తుల డిజైన్‌తో పాటు వాటిని వినూత్నంగా తయారుచేసే అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లల కోసం సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులు టీ వర్క్స్ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించి, పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.